whatsapp Posts రూపాయి బియ్యం తినలేం

రూపాయి బియ్యం తినలేం..
       50 రూపాయలకి బియ్యం కొనలేం
▪ మున్సిపల్ నీళ్ళు తాగలేం..
       మినరల్ వాటర్ కొనలేం
▪ ఇందిరమ్మ ఇళ్ళలో ఉండలేం..
      కలల ఇల్లు కట్టుకోలేం
▪ ప్రభుత్వ బడికి పంపలేం..
      కార్పొరేట్ ఫీజులు కట్టలేం
▪ సర్కారు దవాఖానా కు పోలేం..
       కార్పొరేట్ బిల్లులు కట్టలేం
▪ సిటీ బస్సుల్లో వెళ్ళలేం..
      బండికి పెట్రోలు కొనలేం

ఎందుకంటే..మనం మిడిల్ క్లాస్..కాబట్టి.!!!

👋🏻కులం పోవాలని చెప్పేది మనమే..
👋🏻కులం చూసి ఓటు వేసేది మనమే..
👋🏻అవినీతి పోవాలనేది మనమే..
👋🏻అవకాశం. వస్తే అవినీతిని సమర్ధించేది మనమే..
👋🏻ఇంటికో భగత్ పుట్టాలని చెప్పేది మనమే..
👋🏻మన ఇంట్లో మాత్రం బిల్ గేట్స్ పుట్టాలని కోరుకునేది మనమే..
👋🏻మార్పు రావాలని చెప్పేది మనమే..
👋🏻అబ్బే పబ్లిక్ మారరండీ అంటూ నిరాశ నూరిపోసేది మనమే..
అందుకే.. మనం జస్ట్ ప్రభుత్వానికి పన్నులు కట్టే ........
వెర్రి గొర్రెలు..

ఇది ఎవరు రాసారో కానీ చాలా బాగా చెప్పారు... నాకు వాట్సాప్ లో ఎవరో షేర్ చేశారు... మధ్య తరగతి వాడిని కదా నాకు నచ్చింది ... (నచ్చితే మీరు కూడా షేర్ చేయండి..
 *✅ అదేమి విచిత్రమో గానీ ... శవాన్ని
 ముట్టుకుంటే స్నానం చేస్తాం కానీ కోడి - మేక - గొర్రె లను చంపి తింటుంటాం.*

✅ ఎంత మూర్ఖులం కాకపోతే ....దీపాన్ని వెలిగించి చనిపోయిన వారిని గుర్తుకు తెచ్చుకుంటాం కానీ అవే దీపాలను ఆర్పి పుట్టిన రోజులు జరుపుకుంటాం.

✅మన ఆచారాలు ఎలాంటివి అంటే.......ప్రాణం పోయిన శవం ముందు వెళ్తుంటుంది - ఊరు జనం అంత వెనుక వస్తుంటారు. అలాగే పెళ్ళికొడుకు - పెళ్ళికూతురు ఊరేగింపులో వెనుక వస్తుంటారు కానీ ఊరు జనం అంతా ముందు వెళ్తుంటారు.

✅ మంచి పని చేసేవాడు ఊరు ఊరు వెళ్తాడు కానీ చెడ్డ పని చేసేవాడు ఎక్కడికి వెళ్ళడు .......... సారాయి (వైన్ షాప్) అమ్మేవాడు ఒక దగ్గరే ఉంటాడు కానీ అదే పాలు అమ్మేవాడు ఊరు ఊరు - వీధి వీధి - ఇంటి ఇంటికి వెళ్తాడు.

✅ మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే ....పాలవాడుని మాటి మాటికి అడుగుతుంటాం - నీళ్ళు కలిపావా అనీ, కానీ మందులో మాటి మాటికి నీళ్ళు కలిపి త్రాగుతుంటాం.

✅ గ్రంధాలయంలో భగవద్గీత - ఖురాన్ పక్క పక్కనే ఉంటాయి కానీ ఎప్పుడూ అవి తగువులు ఆడుకోవు....కానీ ఆ రెండు చదివేవాళ్ళు మాత్రం తగువులు ఆడుతూ కొట్టుకుంటూ ఉంటారు.

✅ దేవాలయం - మసీదు అనేవి ఎలాంటి స్థలాలు అంటే పేదవాడు బయట అడుక్కుంటాడు - ధనవంతుడు లోపల అడుక్కుంటాడు.

✅ విచిత్రం ఏమిటంటే ......గోడకు తగిలించిన మేకు జీవితాంతం ఫొటోని మోస్తుంది కానీ మనం మాత్రం ఆ ఫొటోని పొగుడుతుంటాం అసలు మేకుని పట్టించుకోం.

ఎవరైనా నువ్వు " పశువు " లా ఉన్నావు అంటే చాలు కోపగించుకుంటాం కానీ నువ్వు " సింహంరా (పులిరా) " అంటే చాలు లోలోనే ఎగిరి గంతులు వేసి ఆనందిస్తాం.! 

No comments:

Post a Comment

how to transform life into peace

Thirty years ago, on that evening when I shook myself out of a flood of ecstasy and realization, I thought, ‘This is it, this is so simple. ...