Funny (comedy) Telugu Story for Kids onion and tomato

    ఒక ఉల్లిపాయ.. ఒక పచ్చి మిరపకాయ..ఒక టమాటా..
ఒక ఐస్ గడ్డ..ప్రాణ స్నేహితులు గా ఉండేవి..
ఒకరోజు ఇవి నాలుగు కలసి,సముద్ర స్నానం చేసి,
దైవ దర్శనం చేసుకోవాలని అనుకుని,బయలుదేరి రోడ్డు
పక్కగా నడుచుకుని వెళుతున్నాయి..
అలా వెళుతుండగా,ఒక ఆటో వచ్చి ఢీ కొనగా,టైర్ కింద పడి టమాట చనిపోయింది..😭 టమాట చనిపోయిందన్న బాధతో..ఉల్లిపాయ,పచ్చి మిరపకాయ,ఐస్ గడ్డ
భోరు భోరున విలపించాయి😭😭. కొంత సేపటి తరువాత
తిరిగి బయలుదేరి రోడ్డు పక్కగా నడచి వెళుతున్నాయి..
రోడ్డు పక్కన బజ్జీలు వేసేవాడు చూసి,పచ్చి మిరపకాయ ను పట్టుకుని,శనగపిండి లో ముంచి,నూనె మూకిడిలో
వేసేసాడు... అంతటితో పచ్చి మిరపకాయ చనిపోయింది..😭
ఇక ఉల్లిపాయ,ఐస్ గడ్డ చాలా సేపు ఏడ్చి...😭తిరిగి బయలుదేరి,సముద్రం చేరుకుని,స్నానానికి దిగాయి..
కొద్దీ సేపటి తరువాత స్నానం పూర్తి చేసుకుని ఒడ్డుకు చేరుకుంది ఉల్లిపాయ..ఎంతసేపటికి ఐస్ గడ్డ తిరిగి రాకపోవడంతో,ఏడుస్తూ కూర్చుంది ఉల్లిపాయ..😭
ఐస్ గడ్డ సముద్రపు నీటిలో కరిగి చనిపోయిందని తెలుసుకుని,ఏడ్చుకుంటూనే వెళ్లి,గుడిలో దేవుని ముందు
సొమ్మసిల్లి పడిపోయింది.😭.కొన్నిరోజుల అలాగే ఉండిపోయింది..కొన్నిరోజుల తరువాత............
దేవుడు ప్రత్యక్షం అయ్యాడు..అమ్మా ఉల్లిపాయ ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు..? ఏమిటి నీ బాధ అని అడిగాడు.
అప్పుడు ఉల్లిపాయ.....😭స్వామీ....ముగ్గురు ప్రాణ స్నేహితులను కోల్పోయాను అయినా తట్టుకున్నాను..
టమాట చనిపోయినప్పుడు నేను,పచ్చిమిరపకాయ,ఐస్ గడ్డ..కలసి ఏడ్చాము.😭.పచ్చిమిరపకాయ చనిపోయినప్పుడు నేను,ఐస్ గడ్డ కలసి ఏడ్చాము..😭
ఐస్ గడ్డ చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను..😭
స్వామీ...నా బాధ ఏమిటంటే.....
నేను చనిపోయింతరువాత.... నా కోసం ఏడ్చేవారు గాని,
నాకోసం ఒక్క కన్నీటి చుక్క కార్చేవారు గాని ఎవరూ
లేరుకదా....అంటూ భోరుబోరు న విలపించసాగింది..😭😭
😁అపుడు దేవుడు కరుణించి,ఉల్లిపాయ బాధ ను అర్ధం
చేసుకుని,ఈ విధంగా వరం ఇచ్చాడు.
అమ్మా... ఉల్లిపాయ,నీకోసం ఏడ్చేవారు లేరని....
నీ కోసం కన్నీరు కార్చేవారు లేరని.....నువ్వు బాధపడవద్దు. ఎవరైతే నిన్ను కత్తితో కోసి,నీ మరణానికి
కారణం అవుతారో....వారే నీకోసం ఏడుస్తారు
నీ కోసం కన్నీరు కారుస్తారు..😭😭ఇదే నేను నీకు ఇస్తున్న వరం.
అని చెప్పి దేవుడు అదృశ్యమయ్యారు..😊 😀😁ఇది ఉల్లిపాయ కోస్తే...కన్నీళ్లు రావడం వెనుక ఉన్న కథ..        😊😀😁

No comments:

Post a Comment

how to transform life into peace

Thirty years ago, on that evening when I shook myself out of a flood of ecstasy and realization, I thought, ‘This is it, this is so simple. ...