Value of Time Excellent Lecture Telugu Story must Read

ఈ ప్రపంచం లో ఖరీదయిన డబ్బు ఏదైనా ఉంది అంటే అది ఒక్క టైం మాత్రమే. గడిచిపోయినా సమయాన్ని కొనలేము ఏమో కానీ మిగిలి ఉన్న సమయాన్ని మాత్రం కొనవచ్చు. బిల్ గేట్స్ జీవితం లో రోజుకి 24 గంటలు మాత్రమే ఉన్నాయి అని అనుకోవడం పొరపాటు.  బిల్ గేట్స్ జీవితంలో రోజు కి 24 గంటలు కాదు 70,000*24 గంటలు. ఇక్కడ 70,000 అంటే అతని దగ్గర పని చేస్తున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళందరి సమయం అతనిది కదా? కావున ఉన్న సమయాన్ని నువ్వు కొనగలుతావ్ కానీ గడిచిన సమయాన్ని నువ్వు కొనలేవు.  

ఒక్క రోజు విలువ ఎంత అని మీకు తెలియాలంటే రెక్క ఆడితే కానీ డొక్కా ఆడని కుటుంబాలని అడగండి. తన కాళ్ళ ముందు పసి పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు కానీ తినిపించడానికి, తాగించాడానికి  ఏమి లేదు తన దగ్గర ఎందుకు అంటే ఆ ఒక్క రోజు తనకి పని దొరకలేదు కాబట్టి. ఒక వ్యక్తి కి హార్ట్ ఎటాక్ వచ్చింది హాస్పటల్ కి తీసుకెళ్లారు డాక్టర్స్ సారీ ఇతను చనిపోయాడు, ఒక గంట ముందు ఇతడిని తీసుకోచుంటే బతికేవాడు అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. 

ఆ వ్యక్తి యొక్క కుటుంబాన్ని అడగండి ఆ ఒక్క గంట విలువ ఎంత అని. ఆ అనాధ పిల్లల్ని అడగండి ఎవరి నాన్న అయితే చనిపోయాడా ఒక్క గంట ఆలస్యం అవడం వాళ్ళ. ఆ భార్యని అడగండి ఎవరి భర్త అయితే చనిపోయాడా ఒక గంట ఆలస్యం అవడం వాళ్ళ. 
ఒక్క గంట్ల విలువ ఎంత...?


             ఈ ప్రపంచం లో రెండు రకాలయిన వ్యక్తులు ఉన్నారు ఒకడు సమయాన్ని కొనేవాడు, ఇంకొకడు సమయాన్ని అమ్మే వాడు. ఎవడి జీవితం అయితే క్లియర్ గ ఉంటుందో వాడు సమయాన్ని కొంటాడు. ఎవడి జీవితం అయితే క్లియర్ ఉండదో వాడు సమయాన్ని అమ్ముతాడు. చరిత్ర తిరగ రాసి చూడండి, సాధించినవారు ఎవరు కూడా కేవలం ఇంట్రెస్ట్ ఒక్కటే ఉంది సాధించిన వాళ్ళు కాదు. ఆ గెలుపు అనే ఆట మీ మైండ్సెట్ మీద ఉంది మీరు కమిట్మెంట్ ఉన్నవాళ్ళ? అయితే సాధిస్తారు. 

ఏ లక్ష్యం కోసం అయితే నువ్వు వెళ్తున్నావో,  ఏ లక్ష్యం కోసం చేరుకోవడానికి లేదా నీ గమ్యం అనే కల నెరవేర్చుకోవడానికి నువ్వు వెల్త్న్నవో అప్పుడే నీకు జీవితంలో ఎన్నడూ తాగాలని దెబ్బలు నీకు తగులుతాయి, సమస్యలు వస్తాయి. అనుకోని అవాంతరాలు ఎదురు అవుతాయి. ఈ సమస్యలు, ఎదురు దెబ్బలు నీ లక్షయం నీకు పెడుతున్న పరీక్షలు, కాబట్టి మధ్యలోనే నువ్వు ఆగిపోతావా లేక వాటిని దైర్యంగా ఆత్మవిశ్వాసం తో కమిట్మెంట్ గా ఎదుర్కొని నీ లక్షయాన్ని నువ్వు చేరుకుంటావా?  సమస్యని చూసి భయపడకూడదు. సమస్యని లక్ష్యాన్ని గుర్తు చేసుకో. ఎప్పుడు అయితే నే ఫోకస్ లక్ష్యం మీద ఉంటుందో అప్పుడు ఇంకా నీకు సమస్యలు కనిపించవు. ఎప్పుడు అయితే నీ ఫోకస్ లక్ష్యం మీద ఉండదో అప్పుడు నీకు అన్ని సమస్యలు కనిపిస్తాయి. ప్రతి గంట మన భవిష్యత్తు. ప్రతి రోజు ని మనం నిర్మించాలి వేరేవాళ్లు కాదు. ప్రతి క్షణం మనది వేరొకరిది కాదు

No comments:

Post a Comment

STUBBORN WOMEN ARE ALWAYS FAILURES

 STUBBORN WOMEN ARE ALWAYS FAILURES! A STUBBORN WOMEN MAKES A MAN 10 TIMES MORE STUBBORN.  Written by Amina Al-Harbi, social consultant Stub...