ఒక తండ్రి ఒక కొత్త కారు ని కొంటాడు. అది చాల ఖరీదు అయినది. అయితే ఆ తండ్రి కారుని ముందు నుంచి కడుకుగుతున్నాడు. అప్పుడు వెనుక నుంచి అతని కొడ్తూరు ఒక చిన్న సూది రాయితో ఆ కారు మీద గిర్ గిర్ మని బొమ్మ గీస్తుంది. అది చూసిన ఆ తండ్రికి కోపంతో ఓయ్! పిచ్చిదానా ఎం చేస్తునవ్ నువ్వు? అని ఆ కూతుర్ని గెంటేస్తాడు అపుడు కూతురు వెళ్లి కింద ఉన్న ఒక బాండ రాయి తగులుతుంది అంతే తన రెండు కళ్ళు లో నుంచి రక్తం వస్తుంది మరియు ఆ పాపా స్పృహ తప్పి పడిపోయింది. ఆ తండ్రితో కోపం అలానే ఉంది. కానీ కూతురిని చూస్తూ అమ్మ! తల్లి! ఏమైంది నీకు? లేమ్మా అని ఏడుస్తూ అదే కారులో కూతురిని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. అప్పుడు డాక్టర్స్ ఆమెకి ఆపరేషన్ చేస్తారు. కానీ ఆ పాపకి రెండు కళ్ళు పోయాయి అదే విషయాన్ని ఆమె తండ్రి దగ్గరకి వెళ్లి చెప్తారు. అప్పుడు ఆ తండ్రి కూతురి రెండు కళ్ళు పోయాయని తెలిసి ఎంతో కుమిలి పోతాడు మనసులో. కానీ ఏడుస్తూ డాక్టర్ ని ఇలా అడుగుతాడు ఇపుడు నేను నా కూతురుని చూడొచ్చా అని? అపుడు ఆ డాక్టర్ ఓకే వెళ్లి చూడండి అని అంటారు. ఇంకా తాను చూడలేదు అనగానే ఆ తండ్రి కి తాను చేసిన తప్పు గుర్తుకు వచ్చి చాల సిగ్గుపడతాడు. నెమ్మదిగా తన పాపా దగ్గరకి వెళ్లి తల్లి! అని పిలవగానే పాపా నాన్న నాకు ఏమి కనిపించడం లేదు. నువ్వు ఎక్కడకి వెళ్లవు. నాన్న నన్ను క్షమించు ఇంకెప్పుడు కూడా నేను రాయితో కారు మీద గీతాలు గీయను అని అంటుంది. అది విన్న ఆ తండ్రికి చాల ఏడుపు వస్తుంది. నాన్న నిన్ను చూడాలనిపిస్తుంది నాన్న అని ఆ కూతరు అంటుంటే, ఆ తండ్రికి తెలుసు ఆ కళ్ళు ఇంకా ఎప్పటికి రావని. అక్కడే ఉంది గట్టిగ ఏడవలేక బయటకి వచ్చేసి ఏడుస్తాడు. తన కూతురుని కొట్టిన చేతులని చూసి బిగ్గరగా ఏడుస్తాడు. అతని కళ్ళు కన్నీళ్లతో మసకబారాయి. ఏవ్ కళ్ళతో తన కూతుర్ని హాస్పిటల్ కి తెచ్చిన కార్ ని చూసాడు. అదే విదంగా తన కూతురు కారు మీద రాయితో గీసిన గీతాలని కూడా చూస్తాడు, అక్కడ ''ఐ లవ్ యూ డాడ్'' అని ఉంటుంది.
మనిషి వస్తువుల గురుంచి మనుషులని ప్రేమేనిచాడం లేదు. మనం ప్రేమించాల్సింది మనుషులని వస్తువులని కాదు. తొందరపాటు ఎందుకు. ఈ కార్ కాకపోతే ఇంకొక కారు ఆ తండ్రికి కానీ కళ్ళు ఆలా రావు కదా. ఆ పాపా కి ఎంత నరకం అది. ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా లవ్ చేయండి మీ పిల్లల్ని వస్తువులని కాదు.
మనిషి వస్తువుల గురుంచి మనుషులని ప్రేమేనిచాడం లేదు. మనం ప్రేమించాల్సింది మనుషులని వస్తువులని కాదు. తొందరపాటు ఎందుకు. ఈ కార్ కాకపోతే ఇంకొక కారు ఆ తండ్రికి కానీ కళ్ళు ఆలా రావు కదా. ఆ పాపా కి ఎంత నరకం అది. ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా లవ్ చేయండి మీ పిల్లల్ని వస్తువులని కాదు.
No comments:
Post a Comment